సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్

నోటి మాటలతో కడుపు నిండదు-జాతీయ విపత్తుగా ప్రకటించాలి

On

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం : సిపిఐ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద  గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు నోటి మాటలతో వరద బాధితుల కడుపు నిండదని ఘాటుగా విమర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను, ఆదుకోవాలని అలాగే ఇళ్లల్లోకి వరద వచ్చి నష్టపోయిన వరద ముంపు కుటుంబాలను కూడా ఆదుకోవాలని అన్నారు. పంట నష్టం ఎకరానికి30000 వేల రూపాయలు, ఇంటి నష్టానికి 50,000 ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల ఉపకరణానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా , రైతు సంఘాల నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు ,ముంపు ప్రాంతాల బాధితులు రైతులు,IMG20240912124820 తదితరులు పాల్గొన్నారు .

 

 

Views: 107
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు