ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

On
ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు..!

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన హెడ్ మాస్టర్ వక్రమార్గంలో నడుస్తున్నాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల పాలిట కీచకుడిలా మారి నీచంగా ప్రవర్తిస్తున్న హెడ్ మాస్టర్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఆది ఆంధ్ర) నందు హెడ్ మాస్టర్ గా కె.సుప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల హెడ్ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అసభ్యకర వీడియోలను చూపిస్తున్నాడని, చాలా కాలంగా పాఠశాలలో చదుతున్న విద్యార్థులపై ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండలంలోని ఎంఈఓ ఎస్.సువర్ణలా సునియమ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఎంఈఓ సదరు హెడ్ మాస్టర్ విషయమును గురించి విచారించుకుని పెద్దకడుబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఎంఈఓ ఫిర్యాదు మేరకు ఎస్ఐ విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడమైనదని ఎస్ఐ నిరంజన్ రెడ్డి విలేకరులకు తెలిపారు.pocso-2

Views: 61
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన