డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత
కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్
On
సమాచారం తెలపడానికి 100కు డయల్ చేయండి
కొత్తగూడెం ( న్యూస్ ఇండియానరేష్) సెప్టెంబర్ 25: ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్ ఆదేశాల మేరకు వన్టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ వద్ద డ్రగ్స్ నిర్మూలనపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత అని , డ్రగ్స్ వల్ల యువత పెడదారి పడుతుందని, డ్రగ్స్ అరికట్టకపోతే మనమే బాధితులం అవుతామని అన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి తెలపడం కోసం 100కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది కిషన్, చారి ,సలీం, బిక్షపతి పాల్గొన్నారు.
Views: 26
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Oct 2025 19:28:39
ఖమ్మం అక్టోబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న గుద్దేటి రమేష్ బాబు కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం...
Comment List