సర్వజన ఆస్పత్రిలో రెండు థైరాయిడ్ ఆపరేషన్స్ విజయవంతం
అరకొర సదుపాయలు ఉన్న ఆపరేషన్ సక్సెస్
కలెక్టర్ చొరవతో 5 కాటరి మిషన్స్ ఏర్పాటు
కొత్తగూడెం (న్యూస్ ఇండియా )26: కొత్తగూడెం సర్వేన ఆసుపత్రిలో ఒకే రోజు రెండు థైరాయిడ్ ఆపరేషన్స్ విజయవంతంతో పాటు ఆర్థోపెటిక్ సర్జరీ కూడా గురువారం పూర్తి చేశామని, ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవతో 5 కాటరి మిషన్స్ అందుబాటులోకి వచ్చాయని వాటి ద్వారానే థైరాయిడ్ ఆపరేషన్స్ పూర్తి చేశామన్నారు. గతంలో ఈ సదుపాయం లేనందున ఆపరేషన్కు ఇబ్బందులు ఏర్పడేది, కాటరి మిషన్స్ అందుబాటులో ఉండటం వలన మొట్టమొదటిసారిగా ఒకే రోజు రెండు ఆపరేషన్స్ చేయగలిగేమన్నారు. వీటికి ముఖ్యంగా వెంటిలేటర్ , సిబ్బంది కొరత ఉన్నా కానీ ,రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సేవా దృక్పథంతో ఈ ఆపరేషన్స్ సక్సెస్ చేశామని తెలిపారు. వెంటిలేటర్ సదుపాయాలతో పాటు మరిన్ని సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లయితే ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా నిరుపేద రోగులకు వైద్యం అందించగలమని దీమా వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్లు జనరల్ సర్జన్ డాక్టర్ నవదీప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఈఎన్టి సర్జన్స్ డాక్టర్ సాంసన్ (హెచ్వోడి ప్రొఫెసర్), డాక్టర్ రవి (అసిస్టెంట్ ప్రొఫెసర్), అనిస్తిష్య టీం డాక్టర్ రమేష్ ఆర్ఎంఓ (అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ రాము హెచ్వోడి (అసిస్టెంట్ ప్రొఫెసర్),నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
.
Comment List