మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

On
మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 25:- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు కు కురువ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో మాదాసి-మదారి కురువ హక్కులకై నేటికి పోరాటం జరుగుతుందని ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవలను మాదాసి-మదారి కురువలుగా గుర్తించాలని తెలిపారు. ఈ కులానికి సంబంచిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలనీ, చదుకునే పిల్లలకు భవిష్యత్ లో ఈ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగకరమని ఎంపీ నాగరాజు కు మాదాసి మదరి కురువ మంత్రాలయం తాలూకా ఇన్చార్జి దిద్దికాటి బీరప్ప మరియు మండల అధ్యక్షుడు గంగులపాడు రమేష్ లు తెలిపారు. వినతి పత్రం అందుకున్న అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు సానుకూలంగా స్పందించి కచ్చితంగా ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవల హక్కులకై గళం విప్పుతామని తెలిపారు.IMG_20240926_221944

Views: 26
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News