మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
-బచ్చన్నపేట ఎస్సై హమీద్...
By Ramesh
On
అక్టోబర్ 06, న్యూస్ ఇండియా తెలుగు ( బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

మద్యం సేవించి వాహనాల నడపరాదని బచ్చన్నపేట ఎస్సై హమీద్ వాహనదారులను హెచ్చరించారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్సై హమీద్ ఆదివారం రోజున కోన్నే వెళ్ళే దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.వాహనాల యొక్క ధృవపత్రాలను పరిశీలించారు.సరైన పత్రాలు లేని వారికి, మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి ఆన్లైన్లో జరిమానాలు విధించారు.వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 556
Tags:

Comment List