. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
ఫార్మాసిటీ.. ఫోర్త్ సిటీలపై సీఎం దొంగమాటలు..
పేదల ఇళ్ల జోలికి వెళ్లొద్దు... నా ఇల్లు కూలగొట్టుకో..
ఫార్మాసిటీ.. ఫోర్త్ సిటీలపై సీఎం దొంగమాటలు..
ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ హాట్ కామెంట్స్..
ఇబ్రహంపట్నం/ ఆదిభట్ల, అక్టోబర్ 20 (న్యూస్ ఇండియా ప్రతినిధి): 'నా ఇళ్లు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే, నీ కళ్లు చల్లబడుతాయంటే కూలగొట్టుకో.. కానీ పేదల ఇళ్ల జోలికి వెళ్లకు' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ.. ఫోర్త్ సిటీలపై సీఎం రేవంత్ రెడ్డి అన్ని దొంగమాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నాడని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బయట ఫార్మాసిటీ రద్దు అయిందని చెబుతున్న సీఎం కోర్టులో మాత్రం ఉందని అంటున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీ కోసం నాలుగు ఇంచుల భూమిని కూడా సేకరించలేదని, మరి ఫార్మాసిటీ రద్దు చేస్తే.. ఫోర్త్ సిటీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో, కోర్టులో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ హెచ్చరించారు. గల్లీ, గల్లీ తిరిగి రేవంత్ మోసాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ దండా చేస్తా.. మా వాళ్లకు భూములు కట్టబెడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని స్పష్టం చేశారు.
Comment List