కూతురు వికలాంగురాలు భర్త మృతి తో రోడ్డున పడిన కుటుంబం దాతల సహాయం కోసం ఎదురు చూపులు..

ప్రాణదాత ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు, మూడు నెలల గ్రసరీ పంపిణీ చేసిన వ్యవస్థాపకులు రాజు

On

IMG-20241102-WA0075(1)న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 2(నల్గొండ జిల్లా ప్రతినిధి): ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుకుల జీవితంలో కొనసాగుతున్న తరుణంలో పక్కవారి ఆపదలో ఉన్న సహాయం చేసే అంత ఉన్న చేయలేని సమయంలో జీవిస్తున్నాం. కాలం పెట్టే పరీక్షలో తన భర్త డ్రైవర్ వృత్తి ఉద్యోగంలో రాణిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో భర్త ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో జీవనం సాగిస్తుంది షేక్ నజీమా ఆమెది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని భీమారం గ్రామం ఈ సందర్భంగా న్యూస్ ఇండియ తెలుగు ఛానల్ పలకరించగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. తన భర్త అకాల మరణంతో అటు అత్తగారి నుండి గాని ఇటు అమ్మగారి నుండి గాని ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవటం దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న అని తెలిపారు. తన భర్త షేక్ యునస్ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది అని, అప్పుడు తన బిడ్డ షేక్ రిజ్వానా ఒక సంవత్సరం పాప కానీ తను పుట్టినప్పుడు నుండి మూగది అలాగే కాళ్లు చేతులు పనిచేయవు ఒకరు తినిపిస్తే గాని తినలేదు, తన పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి అలాంటి పరిస్థితుల్లో రెక్కాడితే గాని డొక్కాడే కుటుంబం ఒకరోజు కూలి పని పోతే రెండు రోజులు పూట గడుస్తుంది అని అన్నారు. తనకు హాస్పిటల్ లో చూపిద్దామన్న డబ్బులు లేవు అని చెప్పారు.అలాంటి తరుణంలో ప్రాణ దాతలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని దాదాపు మూడు నెలలకు సరిపోను నిత్యావసర వస్తువులు, వీటితోపాటు 10,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అన్నారు ఇంక ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వారు ఉంటే కింద ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి లేదంటే ఈ నెంబర్ 6309887184కి గూగుల్ పే, గాని ఫోన్ పే గాని చేసి ఆదుకోవాలని తెలియజేశారు.
బ్యాంక్ నేమ్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
బ్యాంక్ అకౌంట్ నెంబర్:73088150735
ఐ ఎఫ్ యస్ సి కోడ్:APGV0006311IMG-20241102-WA0077

Views: 444

About The Author

Post Comment

Comment List

Latest News