డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మొదటి సెమీస్ లో పోలీస్ జట్టు విజయం

On
డాక్టర్ బి ఎస్ రావు క్రికెట్ పోటీలో సెమిస్కు చేరుకున్న నాలుగు జట్లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వినయ్ కుమార్

కొత్తగూడెం నవంబర్12: ఐదు రోజులుగా డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్  క్రికెట్ టోర్నమెంట్ లో 12 జట్లు పాల్గొని , 8 జట్లు నిష్క్రమించి, 4 జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. మొదటి సెమీ ఫైనల్ గా పోలీసు జట్టు మరియు బెటాలియన్ -6 జట్ల మధ్య పోటీ మంగళవారం నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన పోలీసు జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 167/8 పరుగులు చేసి,168 పరుగుల విజయ లక్ష్యాన్ని బెటాలియన్-6 జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన బెటాలియన్-6 జట్టు 18 ఓవర్లలో 116/10 పరుగులు చేసి ఓటమి చెందింది . ఈ మొదటి సెమీ ఫైనల్ లో పోIMG20241112151407లీసు జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. పోలీసు జట్టు నుండి బాల(47),జి.రాజు(35),సురేష్(23)అత్యధిక పరుగులు చేశారు. బెటాలియన్ జట్టు నుంచి చలపతి (28), రాంబాబు (21) అత్యధిక పరుగులు అందించారు. పోలీసు జట్టు నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వినయ్ కుమార్ కు ఆర్ఐ సుధాకర్, ఎస్ఐ నరేష్ ,ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, చేతుల మీదుగా అవార్డును అందించారు. వ్యాఖ్యతగా జాన్సన్ డేవిడ్(బాబు), సాంసన్,ఆర్గనైజర్ మడికంటి నవీన్,ఎంపైర్లుగా సన్నీ శోబస్,కిరణ్ వ్యవహరించారు

Views: 80
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు