ఎల్లమ్మ గడ్డ నూతన గ్రామపంచాయతీ కోసం

పోస్టులో వినతిపత్రం పంపిన

By Venkat
On
ఎల్లమ్మ గడ్డ నూతన గ్రామపంచాయతీ కోసం

తండా గిరిజనులు

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అనసూయ ( సీతక్క ) లకి నమస్కరించి రాయునది...

ఈరోజు పోస్ట్ ఆఫీస్ ద్వారా తమ సమస్యలను తెలపడం జరిగింది.

విషయం:- ఎల్లమ్మ గడ్డ తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయుట కొరకు లేదా గ్రామపంచాయతీగా గుర్తించని యెడల బొమ్మెర గ్రామపంచాయతీలో యధావిధిగా ఉంచుట గురించి విన్నపం. 

        అయ్యా  
 పై విషానుసారముగా తమరితో మనవి చేయునది ఏమనగా బొమ్మెర గ్రామ శివారులోని ఎల్లమ్మ గడ్డ తండా, బాబు నగర్ తండా కలదు. పూర్వం నుండి ఎల్లమ్మ గడ్డ తండా, బాబు నగర్ తండా ఓటర్లు బమ్మెర గ్రామంలో ఉండేది. అలాగే రెవెన్యూ గ్రామపంచాయతీ కూడా బొమ్మెరలో ఉండేది. కానీ 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీగా చేస్తామని చెప్పింది. ఎల్లమ్మ గడ్డ తండను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయుటకు మొదటి ప్రతిపాదన చేశారు. కానీ చివరి ఈ ప్రతిపాదనలు ఎల్లమ్మ గడ్డ తండాకు మొండి చేయి చూపించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 2018 సంవత్సరంలో వరకు తమ తండాలను సమీప గ్రామమైన బమ్మెర గ్రామపంచాయతీలో ఉండాలి. మా తండాను 2018 సంవత్సరంలో మండలంలోని వేరే గ్రామమైన  అయ్యంగార్ పల్లిలో విలీనం చేసి అన్యాయం చేశారు. బమ్మెరలో మాకు భౌగోళికంగా ఉన్న అవినాభావ సంబంధాలు కొత్త పంచాయతీ రాజ్ చట్టం తో విభజించడం వల్ల  మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని ఆందోళనచేస్తున్నాము. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ పంచాయతీలో మానసికంగా, భౌగోళికంగా, అభివృద్ధి పరంగా ఈమడలేక పోతున్నాము. సంబంధాలు లేని గ్రామపంచాయతీలో కలుపడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. గ్రామపంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు ఒక ఒక గ్రామంలో ఎంపిటిసి ఎలక్షన్ వచ్చినప్పుడు మరొక గ్రామంలో ఓట్లు వేయడం అనేక ఇబ్బందులకు గురవుతున్నాము.                 
మా మీద దయ తలచి మా తండా ఓటర్లను మా పాత గ్రామపంచాయతీలో బమ్మెరలో ఉంచాలని మా తండా వాసుల ప్రార్ధన. 
ఈ కార్యక్రమంలో బానోత్ రమేష్, బొజ్జ, బిక్కు, రవి, చిన్న రమేష్, నరేష్, బిచ్చం, నునావత్ సురేష్, నెహ్రు, శ్రీను, చిరంజీవి, యాకు, రవి పాల్గొన్నారు.IMG_20241129_192105

Read More దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

Views: 13
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News