విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో తొర్రూరు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు సల్వోజు దేవేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి దుర్సోజు అంజనాచారి మాట్లాడుతూ, కార్పెంటర్స్ అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

గౌరవ సలహాదారులుగా కాసోజు శ్రీనివాసచారి, పబ్బోజు వెంకటాచారి, రబ్బనపురి సోమలింగాచారి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ఈ క్యాలెండర్ ముఖ్య పాత్ర పోషిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం  చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అలుగోజు చంద్రశేఖరాచారి, కోశాధికారి రాపాక శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు రాపాక సోమేశ్వర చారి, సహాయ కార్యదర్శులు కందుకూరి భాస్కరాచారి, మునిగంటి వినయ్ కుమార్, ప్రచార కార్యదర్శులు రాపాక విజయ్ కుమార్, అక్కెర వినయ్ కుమార్, మాజీ అధ్యక్షులు తంగిల్లపల్లి పూర్ణాచారి, గజ్జల వెంకటేష్, అబ్బనపురి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.1735541291920

Views: 185
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News