విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో తొర్రూరు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు సల్వోజు దేవేంద్రాచారి, ప్రధాన కార్యదర్శి దుర్సోజు అంజనాచారి మాట్లాడుతూ, కార్పెంటర్స్ అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

గౌరవ సలహాదారులుగా కాసోజు శ్రీనివాసచారి, పబ్బోజు వెంకటాచారి, రబ్బనపురి సోమలింగాచారి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ఈ క్యాలెండర్ ముఖ్య పాత్ర పోషిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం  చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అలుగోజు చంద్రశేఖరాచారి, కోశాధికారి రాపాక శ్రీనివాసచారి, ఉపాధ్యక్షులు రాపాక సోమేశ్వర చారి, సహాయ కార్యదర్శులు కందుకూరి భాస్కరాచారి, మునిగంటి వినయ్ కుమార్, ప్రచార కార్యదర్శులు రాపాక విజయ్ కుమార్, అక్కెర వినయ్ కుమార్, మాజీ అధ్యక్షులు తంగిల్లపల్లి పూర్ణాచారి, గజ్జల వెంకటేష్, అబ్బనపురి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.1735541291920

Views: 186
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.