జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక

On
జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి 6 : కొత్తగూడెం చెందిన  హెడ్ కానిస్టేబుల్  పి. వీరభద్రం 11వ తెలంగాణ స్టేట్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో మూడు మెడల్స్ సాధించి జాతీయ స్థాయిలో జరిగే పోటీకి ఎంపికయ్యారు.  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  ఆదివారం జరిగిన ఈ పోటీల్లో  1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, 5 కిలోమీటర్లు,  400 మీటర్ల పరుగు పందెంలో  వెండి  పథకాలు  సాధించారు.  ఓపెన్ క్యాటగిరీలో  50 ప్లస్ ఏజ్ గ్రూప్ కు నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనగా వీరభద్రం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనత సాధించారు. భద్రాద్రి  కోతగూడెం జిల్లా పోలీస్ శాఖలో ఆర్ ఐ  సుధాకర్  ఆధ్వర్యంలో ఎంటి వింగ్  విభాగంలో  హెడ్ కానిస్టేబుల్  వీరభద్రం  విధులు నిర్వహిస్తున్నారు. సిఐ చెన్నూరి శ్రీనివాస్ సహాయ సహకారం, ప్రోద్భలంతో వీరభద్రం రాష్ట్ర స్థాయిలో రాణించి ఈ నెల 31 నుండి ఫిబ్రవరి3 వరకు కేరళలోని తిరుతిలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
మహబూబాబాద్ జిల్లా :-తొర్రూరు పట్టణం : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా డీజీపీ అమలు చేస్తున్న “అరైవ్, అలైవ్” కార్యక్రమాన్ని మహబూబాబాద్...
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!