రైతు లేనిదే రాజ్యం లేదు

మన దేశానికి వెన్నుముక రైతు

On
రైతు లేనిదే రాజ్యం లేదు

సమాజ సేవకుడు మంతెన మణికుమార్

IMG_20250123_120912పంట పండించే రైతు నేను ఈ ధరకు అమ్ముతా అనే రోజు

రావాలి కార్పొరేట్ కంపెనీలకు

నేను ఈ ధరకు అమ్ముతా అంటే

 అదే ధరకు మనం కొంటున్నాం

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

 అదేవిధంగా మద్యాన్ని కూడా కంపెనీవాడు ఈ రేట్ కి అంటే అదే రేటుకి మనం కొంటున్నాం

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

 కానీ మన దేశంలో ఒక రైతుకు మాత్రమే గిట్టుబాటు ధర దొరకదు

ఆరుగాలం కష్టపడి ఎండనక వానకా చలికి వణుకుతూ దుక్కి దున్ని చెమట ఒడిచి ఒళ్ళున ఓనం చేసుకొని కుటుంబం ఇంటిల్లిపాది కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు దొరికిన రోజు రైతు ఆనందంగా ఉంటే సుభిక్షంగా ఉంటది మన దేశం

 పంట చేతికొచ్చి మార్కెట్ కొట్టకముందేమో మంచి రేటు ఉంటది వడ్లు మిర్చి కంది బొబ్బర్లు పెసర్లు మక్కా జొన్నలు పసుపు ఉల్లి అల్లం ఎల్లిపాయలు టమాట అయినా పంట చేతికొచ్చి మార్కెట్ కొడదాం అనే టైంలో ధర రాక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుల్ని మనం చూస్తాం కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కూలీలు కూడా దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నా రైతులు

 జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పలకడం కాదు

 మనదేశంలో రైతుకి గిట్టుబాటు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినప్పుడే

 మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం రైతును రాజును చేసిన రోజు మాత్రమే.

Views: 107
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News