వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షునిగా పెద్దిటి దామోదర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

On
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

Screenshot_20250215_203502~2
అధ్యక్షులను సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ అవినీతిని కళ్ళకు కట్టినట్లుగా నిరూపిస్తూ జర్నలిజంలో తమకంటూ ప్రత్యేక పాత్ర నిరూపించుకున్న జర్నలిస్టులు ఒక ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన పెద్దింటి దామోదర్ రెడ్డి (నమస్తే తెలంగాణ)ని ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన వలిగొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో గౌరవ అధ్యక్షునిగా శివనాధుల రమేష్ (సాక్షి ),ఉపాధ్యక్షులుగా ఎమ్మే బాలరాజ్ (వార్త )గన్నేబోయిన నరసింహ (ప్రజా దర్బార్) ప్రధాన కార్యదర్శిగా డోగిపర్తి సంతోష్ (సూర్య వెలుగు) కోశాధికారి రాపోలు పవన్ కుమార్ (వాస్తవం) సహాయ కార్యదర్శిగా కట్ట శ్రీనివాస్ (దిశ) సలహాదారులుగా గోద అచ్చయ్య (నేటి వాస్తవాలు) ఆలకుంట్ల కృష్ణ (వార్తా వేదిక సూర్య )తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన పెద్దింటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు,జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని ,తనను ఎంతో నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కదిరేని సురేష్ ,దేశీరెడ్డి వెంకట్ రెడ్డి, ఎల్లంకి రాజు, ఎర్ర శ్రీకాంత్, సుక్క గణేష్, పల్లెర్ల సుధాకర్, వడ్డేమాన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 282

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు