ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

On
ఏసీబీ దాడిలో పట్టుబడిన కూలీలైన్ ప్రధానోపాధ్యాయుడు  

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియాబ్యూరోనరేష్) ఫిబ్రవరి 28 : కొత్తగూడెం పట్టణం పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్ ఏసీబీ అధికారుల మెరుపు దాడిలో శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెందిన ప్రధానోపాధ్యాయుడు తాటి రవీందర్, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల  ఆత్మ రక్షణ కోసం కరాట శిక్షణ కోసం పథకానికి ప్రవేశ పెట్టగా, దానికి సంబంధించిన 72 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు నెలల పరిధికి 30000 రూపాయలు ప్రభుత్వం కరాటే ఇంస్రక్టర్కు అందిస్తుంది. దానిలో నుంచి 20000 లంచం డిమాండ్ చేయగా. కరాటే ఇంస్రక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా, శుక్రవారం కూలి లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ తాటి రవీందర్ 20000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా   పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని , తెలిపిన వారు వివరాలు గోపియంగా ఉంచుతామని ఏసిబి డిఎస్పి తెలిపారు.

Views: 499
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్