పెద్దకడుబూరు మండలం : " దొరికిన దొంగలు - పట్టుకున్న ఎస్ ఐ నిరంజన్ రెడ్డి "....!
దొంగతనం కేసులో 1.బోయ ఉరుకుందు, 2.సుగూరు హరికృష్ణ, 3.బోయ నరసింహులు అనే వ్యక్తుల పై కేసు నమోదు...
- ముద్దాయిల దగ్గర నుండి దొంగలించిన బంగారం, వెండి, నగదు రికవరీ...
న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం మే 21 :- మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామంలో నివసిస్తున్న కురువ మహాదేవ మరియు గుడిసెలు రంగమ్మ ల ఇంట్లో 11-05-2025 తేదీన ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే బాధితులు కురువ మహాదేవ ఇంట్లో ఒకటిన్నర గ్రాముల బంగారం మరియు రంగమ్మ ఇంట్లో 6గ్రాముల బంగారం, 24తులాల వెండి, 51000/-రూ నగదు దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ ఐ దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎట్టకేలకు 21-05-2025 బుధువారం రోజున ఆ దొంగలను ఎస్ఐ నిరంజన్ రెడ్డి పట్టేశారు. ఇంట్లో దొంగతనం కేసులో దొరికిన ముద్దాయిలు 1.బోయ ఉరుకుందు, 2.సుగూరు హరికృష్ణ, 3.బోయ నరసింహులు గా గుర్తించి వారిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. వారి దగ్గర నుండి 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండి ఆభరణా మరియు 51000/- రూ నగదును రికవరీ చేయడం జరిగింది... ఇలాగే ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నిరంజన్ రెడ్డి హెచ్చరించారు... అలాగే మండల పరిధిలో ప్రతి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైనా వలసలు వెళ్తున్నప్పుడు తమ ఇంట్లో విలువైన నగలు గాని మరియు డబ్బులు గాని పెట్టి వెళ్ళరాదని, ఒకవేళ అలా వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులను భద్రతగా దాచుకొని వెళ్లవలసిందిగా ఆయన ప్రజలకు సూచించారు...
Comment List