ఘనంగా గాయత్రి పబ్లిక్ స్కూల్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
న్యూస్ ఇండియా యర్రగొండపాలెం ఆగస్టు15:
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని గాయత్రి పబ్లిక్ స్కూల్ నందు చైర్మన్ పి. నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న శుభవేళ.ఈ శుభవేళ పెరేడ్ నిర్వహిచారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ దాదాపు రెండు వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ పాలనలో భారత దేశం బానిసత్వాన్ని అనుభవించిందని, ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వేచ్ఛను అందించారని గుర్తుచేశారు.1947 ఆగస్టు 15 న వచ్చిన స్వాతంత్ర్యం వారి త్యాగఫలితమన్నారు.ప్రతి పౌరుడు వారి త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని తెలిపారు.ఈ కార్యక్రమం లో డైరెక్టర్ జి. పున్నారావు, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు,ఏ.ఓ రామ కృష్ణ రెడ్డి మరియు టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
Comment List