కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 

పాల్గొన్న ఎంపీ వద్దిరాజు, వనమా, కాపు సీతాలక్ష్మి

On
కెసిఆర్ పై సిట్ విచారణకు నిరసనగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ 

భారీ ఎత్తున బిఆర్ఎస్ బైక్ ర్యాలీ, అడ్డుకున్న పోలీసులు

IMG20260201114213భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చిన బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ఫోన్ టాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలవడంపై రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణుల నిరసనలో భాగంగా భద్రాది కొత్తగూడెంలోని మార్కెట్ యార్డ్ నుంచి పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించరు. తొలుత ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డగించగా, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎలాంటి ఇబ్బందులు కలిగించమని హామీ ఇవ్వడంతో, డిఎస్పి ఆదినారాయణ నిరసనకు అనుమతినిచ్చారు. ఈ ర్యాలీలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీలో, నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ భుక్యా శాంతి, నవతన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Read More నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

Read More సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

 

 

 

Views: 56
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News