టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ గా ఎన్నికల సంఘం ఆమోదం

On

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, […]

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారిక లేఖ పంపింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ భవన్ లో రేపు (శుక్రవారం) ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖపై రిప్లై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించనున్నారు.

Read More పాలకుర్తిలో హరీష్ రావు రోడ్ షో

అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరారు.

Read More ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

Read More ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్చించిన ఈసీ.. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది.

కాగా.. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాలంటూ అక్టోబర్‌ 5న ఈసీకి టీఆర్ఎస్ లేఖ రాసింది.

ఈసీ సూచన మేరకు పబ్లిక్‌ నోటీస్ జారీ చేసింది. ఇందులో బీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు రాలేదు.

దీంతో ఈసీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈసీ పచ్చజెండా ఊపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది.

గులాబీ జెండా మధ్యలో భారతదేశం ఉండేలా నూతన జెండాను బీఆర్ఎస్ రూపొందించింది. పార్టీ పేరు మారినా కారు గుర్తే కొనసాగనుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది