వైశాలి కథ సుఖాంతం!

On

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది. తమ కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుల దాడిలో ఇంట్లోని […]

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓ యువతి కిడ్నాప్ సంచలనం సృష్టించింది.

తమ కుమార్తెన్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వచ్చి కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తూర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నేగుడలోని సిరిటౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు..

ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

Read More అవంతి గ్రూప్స్ ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తా చైర్మన్ శ్రీనివాసరావు..

యువకుల దాడిలో ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారు ధ్వంసం అయ్యాయి. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి.

Read More తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...

ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Read More రేపు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం..

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు

ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు చెప్పారు.

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

యువతిని తీసుకెళ్లిన యువకుడు నవీన్ రెడ్డి మిస్టర్ టీ టైం ఓనర్ గా తెలుస్తోంది.

దుండగులు బాధితురాలి ఇంటిపై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ వీడియోల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలికి పెళ్లి సంబంధం చూడమని స్థానికులను కోరగా.. నవీన్ రెడ్డి సంబంధం తీసుకొచ్చినట్లు బాధితురాలి తల్లి తెలిపింది.

తమకు అబ్బాయి నచ్చలేదని చెప్పామని అయినా కూడా తమ కూతురిని నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ పరిణామాలు జరుగుతుండగానే వైశాలి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. తాను సేఫ్ గానే ఉన్నట్లు వైశాలి చెప్పినట్లు తెలుస్తోంది. యువకుల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య.. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..
కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.రాత్రికి రాత్రి కూల్చివేతలు ..కలెక్టర్, ఎమ్మార్వో ఇతర ప్రభుత్వ అధికారులు...
నూతన బస్సు సర్వీసు ప్రారంభం
తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...
పులిగిల్ల నుండి ఉప్పల్ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
సింగరేణి లాభంలో 33% వాటా బోనస్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పహిల్వాన్ పూర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు