ఎక్కడున్నా ఓటేయొచ్చు..!
కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. దేశీయంగా వలసలు వెళ్లిన వారు… ఉన్న చోటు నుంచే తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మిషన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది. దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ […]
కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది.
దేశీయంగా వలసలు వెళ్లిన వారు… ఉన్న చోటు నుంచే తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ మిషన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది.
దీంతో పాటు ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది.
ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎంను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఈసీ ప్రకటించింది.
రిమోట్ ఓటింగ్‌ను అమల్లోకి తెచ్చేముందు.. ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈసీ వివరించింది.
దీనికోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరనున్నట్లు పేర్కొంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List