ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమా...!

• పగలకొట్టిన కల్వర్టు కి మర్మత్తులు ఎక్కడ..?

On
ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమా...!

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట టౌన్లో బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వైపు రోడ్డు నందు నిర్మించిన కల్వర్టు కొన్ని రోజుల నుండి గుంతల మయంగా దర్శనమిస్తుంది.దీంతో ప్రజలు వాహనదారులు ఆ రోడ్డుపై వెళ్ళుటకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి.హైవే ఇలా ఉన్న ఆర్ అండ్ బి వాళ్లకి కనీసం చీమకుట్టినట్టుగా లేకపోవటం గమనార్హం ఎమ్మార్వో ఆఫీసుకు సచివాలయం కు మరియు ఎండిఓ ఆఫీస్ కు వెళ్ళు వారికి ఆ కల్వర్టు కు ఏర్పడిన గుంతల వల్ల ప్రయాణికులు రాకపోకల విషయంలో ఇబ్బందులకు లోనవుతున్నారు.ఈ కల్వర్టర్ మీద తరచుగా వాహనాలు గుంతలో ఇరక్కపోవటం సహజంగా మారిపోయింది.అలానే సంభందిత అధికారులు కూడా చూస్తూ కాలం వెళ్ళబుచ్చటం ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిద్ర మత్తులో ఉన్న హైవే ఆర్ అండ్ బి వాళ్ళు ఇప్పటికైనా నిద్ర మత్తు వదులుతారా అని ప్రజలు వేచి చూస్తున్నారు.ప్రజల కష్టాలను సమస్యను గుర్తించి తగు చర్యలు తీసుకొని వెంటనే మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చిరు వ్యాపారస్తుల ఆందోళన

ఆ కల్వర్టు కారణంగా చిరు వ్యాపారస్తులు వారి వ్యాపారానికి ఆటంకం కలుగుతుందని సంభందిత అధికారులను మదిలోనే తిట్టిపారేసుకుంటున్నారు.ఆ కల్వర్టు గుంత కారణంగా కల్వర్టు ప్రక్కన ఉన్న చేపల వ్యాపారస్తులు, హోటళ్ళు, కూరగాయలు పండ్లు ఇతరత్రా వ్యాపారస్తులు తమ బండ్లను రోడ్లపైకి తీసుకువచ్చారు.దిని వలన వాహదారులతో పాటు సామాన్య ప్రజలు కాలిబాటన వెళ్ళుటకుIMG_20230922_161513 కూడా ఇబ్బంది పడుతున్నారు.కనుక ఇప్పటికీ అయినా సంభందిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Image 2023-09-22 at 4.44.26 PM (1)

Read More సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?

Views: 267
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News