సెలవు దినంలో యూనియన్ బ్యాంకు సేవలు

నేలవంచ, దొరవారి తిమ్మాపురం, మట్టేవాడ గ్రామాలలో

On
సెలవు దినంలో యూనియన్ బ్యాంకు సేవలు

మీ గ్రామంలో మీ బ్యాంకు సేవలు అనే  నినాదం:బ్యాంకు మేనేజర్ బన్సిలాల్

గూడూరు మండలం లో అత్యంత అరణ్యం లో కొండ కొనల మధ్య గిరిజన గ్రామం అయినటువంటి ఉమ్మడి మట్టవాడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నేలవంచ, దొరవారి తిమ్మాపురం గ్రామంలో ఈరోజు యూనియన్ బ్యాంక్ అధికారులు పాల్గొని రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రామం లో ఉన్న ప్రజలను  ఉద్దేశించి బ్యాంకు మేనేజర్  భన్సిలాల్  మాట్లాడుతూ పూర్తిగా రవాణా సౌకర్యం లేని ఈ గ్రామంలో మీ గ్రామంలో మీ బ్యాంకు సేవలు అనే  నినాదంIMG-20230923-WA0642తో ఈ రోజు బ్యాంక్ సెలవు దినం అయినప్పటికీ  ఆర్థికంగా వెనుకబడిన మీ గ్రామ ప్రజల కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు.అదేవిధంగా అక్కడున్నటువంటి చాలామంది నిరక్షరాస్యులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అని గుర్తించి  పోడు పట్టాలు ఉండి అర్హులైన రైతుల అందరికీ పంట రుణాలు ఇస్తామని అదేవిధంగా మహిళా మణులకు,మహిళల సాధికారత కోసం  ఒక సంఘానికి లక్ష రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తామని, ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని,  బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ,ప్రతి  ఆర్థిక లావాదేవీ బ్యాంకుతో ముడిపడి ఉందని, అదేవిధంగా ప్రతి ఒక్కరు బీమా కలిగి ఉండాలని గ్రామ ప్రజలను ఉద్దేశించి మేనేజర్ బన్సీలాల్ మాట్లాడుతూ రుణం తీసుకున్న రుణ గ్రహీతలు సరైన సమయంలో చెల్లించి రెట్టింపు సేవలను పొందగలరని తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో రైతుల నుండి కొత్త రుణాల కోసం , అదేవిధంగా పాత రుణాల పునరుద్ధరణ సుమారుగా 250 కు పైగా దరఖాస్తులను స్వీకరించారు. గ్రామ  సర్పంచి అనసూర్య  మాట్లాడుతూ ఈ సెలవు దినం లో కూడా మా గిరిజనుల కోసం వచ్చి బ్యాంకు అవగాహన సదస్సు  పెట్టడం చాలా సంతోషదాయకమని అభినందించారు. అదేవిధంగా గ్రామ  ఉపాధ్యాయుడు రమేష్ , పెనక ప్రభాకర్ ,బ్యాంకు సిబ్బంది , బీసీలు సీ ఏ లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 60
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News