పేదింటి ముస్లిం యువతి పెళ్ళి ఖర్చులకు సహాయం
సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు గోపాల్ నగరంలో నివసించే పేద కుటుంబంకు చెందిన షేక్ ముబిన వివాహ ఖర్చులు నిమిత్తం వారి తల్లి షర్మిలకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సూర్యశీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ భాషా చేతుల మీదుగా ఒంగోలు ట్రస్టు కార్యాలయంలో అందజేయడం జరిగింది.
ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భా ష మాట్లాడుతూ ప్రవాస భారతీయుడు అరుణ్ రాజ్ ముబీన పెళ్లి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు అందించి మానవత్వం చాటారని అన్నారు . ఒక మంచి పని వివాహ నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
తమ సంస్ధ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి వైద్యం,విద్య, తలదాచుకొనేందుకు ఇంటిని నిర్మించి ఇవ్వటం జరిగిందన్నారు. ఎవరైనా అర్హులైన పేదవారు విద్య, వైద్యం, జీవనోపాధి కోసం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు సంప్రదిస్తే చేతనైన ఆర్ధిక సహాయం తాము అందిస్తామని తెలిపారు.
Comment List