సామాజిక మాద్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు
*వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్
సామాజిక మాద్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాయి
సామాజిక మాద్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమీషనర్ సూచించారు. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలు గాని ఎవరిపైనగాని తప్పుడు ఆరోపణలకు చేసిన అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేడుక చేసుకోని తప్పుడు పోస్టులు చేస్తే వారిపై తీసుకునే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయి. ఇందులో భాగంగా ఆరోపణలకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు సామాజిక మాద్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేసేందుకుగాను వినియోగించిన కంప్యూటర్లు, ల్యాప్ టాప్లు, హర్డ్ డిస్క్లు, సెల్ఫోన్లు ట్యాబ్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సాక్ష్యాల సేకరణ, దర్యాప్తులో భాగంగా వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
Comment List