వైసీపీ బంగాళాఖాతంలో కలవటం ఖాయం

14వ రోజు రిలే నిరాహార దీక్షలో టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల

On
వైసీపీ బంగాళాఖాతంలో కలవటం ఖాయం

గిద్దలూరు న్యూస్ ఇండియా

రాష్ట్రంలో వైసిపి పాలనలో మోసపోయిన ప్రజలు రాబోవు ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటం ఖాయమని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ గిద్దలూరులో 14వ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ సందర్బంగా దీక్షలలో గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం, కొంగలవీడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వారికీ టీడీపీ ఇంచార్జ్ అశోక్ రెడ్డి సంఘీభావం తెలియచేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నీ వర్గాల ప్రజలను వేదించటమే పనిగా పెట్టుకున్న జగన్ సర్కార్ ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేద్దామని వైసీపీ నేతలు పగటికలలు కంటున్నారని వారి కక్ష సాధింపు చర్యలకు పసుపు సైన్యం అదరదని హెచ్చరించారు. నియోజకవర్గంలో బీసిల సంక్షేమం కోసం పాటు పడింది తెలుగుదేశం పార్టీ అని ఆరు మండలాల్లో బీసి భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించటం జరిగిందని గిద్దలూరులో బీసి భవనం నిర్మాణంలో వైసీపీ ఎందుకు నిర్లక్ష్యం చేసిందని నాలుగున్నర ఏళ్ళ వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ సోదరులకు ఒక్క రూపాయి అయిన మంజూరు చేశారా అని ప్రశ్నించారు, ఈ నాలుగున్నర ఏళ్ళ వైసీపీ పాలనలో బీసిలకు ఏమి చేశారో సమాధానం చెప్పాలన్నారు. బీసీల సంక్షేమం కోసం పాటు పడింది తెలుగుదేశం పార్టీ అని, బడుగుబలహీన వర్గాలకు ఎస్సి ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమాన్ని అందించే నాయకుడు చంద్రబాబు అని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవటం తథ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మండల జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మళ్ళీశ్వరయ్య యాదవ్, కొంగలవీడు సర్పంచ్ పందనబోయిన భూపాల్ యాదవ్, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, రాచర్ల మండల అధ్యక్షులు కటికే యోగానంద్, పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు సుబ్బరాయశర్మ, కొండయ్య యాదవ్, మాజీ సర్పంచ్ ఇమ్మరాజు కేశాలు, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాషా, పందిళ్లపల్లి శ్రీనివాసులు, ఉలాపు బాలచెన్నIMG-20230926-WA0332 IMG-20230926-WA0332  య్య, ఉలాపు శేఖర్, ప్రసాద్, బాబాయ్, భూపాల్ రెడ్డి, చిలకల రమణ, కంచర్ల కిరణ్ గౌడ్, వినుకొండ చిన్న, ఓబయ్య, మరియు టీడీపీ శ్రేణులు పాల్గోన్నారు.

Views: 123
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..