ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు

జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు అందుకున్న

By Venkat
On
ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు

పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్

తెలంగాణ హస్తకళలు,పర్యాటక కేంద్రాలకు లభించిన గుర్తింపు

న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం డిల్లీలో జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా పెంబర్తి గ్రామం ఎంపికైన సందర్భంగా ప్రగతి మైదానంలో అవార్డ్ ను అందజేశారు.తెలంగాణ రాష్ట్రం నుంచి 2 ఉత్తమ పర్యాటక గ్రామాలు పెంబర్తి,చంద్లాపూర్ గ్రామాలు ఎంపిక కాగా బుధవారం అంతర్జాతీయ  పర్యాటక దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలాజా రామయ్యర్,పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు   అందుకున్నారు.వారి వెంట సెక్రటరీ ప్రపుల్ రెడ్డి,అంబాల నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో మంత్రి దయాకర్ రావు,ప్రముఖులు,గ్రామస్తులు సర్పంచ్ కి అభినందనలు తెలియజేశారు.

Views: 24
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News