న్యూస్ ఇండియా కదనానికి స్పందన
ఎట్టకేలకు గ్రామ సెక్రెటరీ పదవి భర్తీ

ఇటీవల న్యూస్ ఇండియా కథనంలో ప్రచురించిన పంచాయతీ కార్యదర్శి సీటు... ఖాళీ అనే కథనానికి స్పందనగా పులిగిల్ల గ్రామ సెక్రెటరీ ఖాళీగా ఉండడంతో ఇటీవల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి ఎంపీడీవో స్పందించి పులిగిల్ల గ్రామానికి గ్రామ సెక్రెటరీగా బూడిద పావని ని పంచాయతీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శిని నియామక పదవికి ఎవరూ కూడా ఆసక్తి చూపకపోవడంతో న్యూస్ ఇండియా కథనంలో పంచాయతీ కార్యదర్శి సీటు ఖాళీ అని ప్రచురించడంతో రెండు నెలల తర్వాత కార్యదర్శి నీ నియమించడం జరిగింది. దీనితో ఎట్టకేలకు ఇన్చార్జి కార్యదర్శి ఉండడంతో రెండు గ్రామాలకు ఒకే కార్యదర్శి కావడంతో వివిధ పనులు చేయడంలో కార్యదర్శి జాప్యం చేయడం జరిగింది ఇకనుంచి అయినా తమ తమ పనులు త్వరగా పూర్తి అవుతాయని పులిగిల్ల గ్రామస్తులు గ్రామ కార్యదర్శి నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List