మజీద్ పూర్ జీవో నెంబర్ 94 వెంటనే రద్దు చేయాలి
మైనార్టీల గ్రేవ్ యార్డును రద్దు చేయాలి.
On
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో మజీద్పూర్ గ్రామంలో జీవో నెంబర్ 94, సర్వేనెంబర్ 253 నెంబర్ లోని 20 ఎకరాలలో నిర్మించనున్న మైనార్టీల గ్రేవ్ యార్డును రద్దు చేయాలని
గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి, ఎంపిటిసి మేడిపల్లి బాలమ్మ, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్ రెడ్డి, మజీద్పూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ ముదిరాజ్, గ్రామ పెద్దలు, యువకులతో కలసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేరే భూమి కేటాయించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భూమిని గ్రామ అవసరాలకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
Views: 4
Tags:
Comment List