బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు అందవేత

On
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

పరామర్శిస్తున్న మాజి సర్పంచ్ రాజు నాయక్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

యాచారం మండలం నందివనపర్తి గ్రామానికి చెందిన మూలి సుగుణమ్మ, గోపాల్ దంపతుల కుమార్తె మూలి కల్పన అనారోగ్యానికి గత కొన్ని రోజుల క్రితం నగరం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ రాజునాయక్, ఉపసర్పంచ్ మూడెడ్ల గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో కల్పనను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పూర్తిగా కోలుకునేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అనంతరం సహాయం చేసిన రాజునాయక్ కి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ తెలుగుమళ్ళ ప్రవీణ్, కొండాపురం శ్రీశైలం,యంజాల చంద్రకాంత్, కొంగరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Views: 28
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు
యర్రగొండపాలెం యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు పుట్టినరోజు వేడుకలు బుధవారం యర్రగొండపాలెంలో సహచర జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ యువ...
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం
ఏఈఓ ల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి
హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 
పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్
ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
జూన్ 9వ తేదిన జరుగనున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.