ఘనంగా నా మట్టి- నాదేశం కార్యక్రమం

On
ఘనంగా నా మట్టి- నాదేశం కార్యక్రమం

కంభం న్యూస్ ఇండియా

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపీడీవో ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో గ్రామ పంచాయతీ నుండి సేకరించిన మట్టి బియ్యం కలశములన్ని కలిపి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జన్మనిచ్చిన నేల తల్లిని స్వచ్ఛంగా జీవించేందుకు అవకాశం కల్పించిన దేశాన్ని గౌరవించుకునేలా చేపట్టిన నా మట్టి నాదేశం కార్యక్రమం ఎంతో మహోన్నతమైందని,ఎందరో మహానీయుల త్యాగం ఫలితంగా స్వాతంత్ర్య భారతావని ఏర్పడిందని, ఆ త్యాగమూర్తులను గ్రామ,మండల స్థాయిల నుంచి స్మరించుకోవడమే ప్రధాన ఉద్దేశం అన్నారు.కార్యక్రమం లో భాగంగా మాజీ సైనికులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి, జడ్పిటిసి, ఎంపిడిఓ, కో - ఆప్షన్, వైస్ ఎంపిపి లు,ఎంపిటిసి లు, సర్పంచ్ లు ,ప్రజా ప్రతినిధులు, ఎన్.ఆర్.జి. ఇ సిబ్బంది, మండల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు ,మాజీ సైనికుల పాల్గొన్నారు.IMG-20231011-WA0170

Views: 135

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News