హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం
నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సహకారంతో
నారాయణాఖేడ్ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సహకారంతో ఖేడ్ పట్టణంలోని అక్షర ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాధవి కోటం మాట్లాడుతూ.. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని బ్రాంచ్ లలో రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సుమారు 30 మంది రక్తదానం చేయడం హర్షణీయమన్నారు.రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటం మరొక జీవనం ఇవ్వడం అన్నారు. రక్తదాన శిభిరానికి సహకరించిన నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ శివ కుమార్, సిబ్బంది గోపాల్ రాథోడ్,కిరణ్ కుమార్, విశ్వనాథ్, బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహీద్ చిస్తీ, సభ్యులు సంతోష్ రావు,అక్షర ఆసుపత్రి డాక్టర్ గిర్మాజీ అనిల్ రావు,ఎక్త అనిల్ రావు,సిబ్బంది రాజేష్,సత్యనారాయణ, స్టాఫ్ నర్స్ లత,పుష్పాలత తదితరులు పాల్గొన్నారు.
Comment List