అంగన్వాడి కార్యకర్తల న్యాయ పోరాటానికి మద్దతు:ముస్లిం యూత్

On
అంగన్వాడి కార్యకర్తల న్యాయ పోరాటానికి మద్దతు:ముస్లిం యూత్

IMG-20231216-WA0736ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం  అంగన్వాడి కార్యకర్తల న్యాయ పోరాటానికి మద్దతుగా ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మరియు  జిల్లా నాయకులు గన్నెపుడి వినయ్.నియోజకవర్గ నాయకులు చేదురి సుబ్బయ్య. సంఘీభావం తెలపడం జరిగింది.ఇస్మాయిల్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాల చిన్నారులు ఎక్కువగా వెళ్లే అంగన్వాడీ కేంద్రాలలో, టీచర్లు, ఆయాలు, హెల్పర్లు చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత మాటలు చెప్పి వీళ్లందరి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న ముఖ్యమంత్రి,  ఒక్కసారి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అక్కచెల్లెమ్మలను మోసం చేశారని అన్నారు. 10 వేలు ఆదాయం దాటిన సిబ్బందికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని అన్నారు.

Views: 24
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News