భక్తుల పూజలు అందుకున్న పెద్దమ్మ తల్లి
చల్లగా చూడమని అమ్మవారికి బోనాలు
On
భక్తుల కొంగుబంగారం పాల్వంచ పెద్దమ్మ తల్లి
పాల్వంచ (న్యూస్ ఇండియా ) జూన్ 30: పాల్వంచ మండలం జగన్నాధపురం- కేశవాపురం గ్రామం శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం( పెద్దమ్మ గుడి) లో అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు .తమను చల్లగా చూడాలని బోనాలు సమర్పించారు. మరియు అన్నప్రాసనలు, వాహన పూజలు,తల నీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, పసుపు ,కుంకుమ ,కానుకల తదితర మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అవసరమైన ప్రత్యేక పూజలు క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వాహన అధికారిని ఎన్.రజనీ కుమారి, సిబ్బంది పర్యవేక్షించారు.
Views: 25
Tags:
Comment List