గిరిజనుల ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు వీరభిమానిగా 14 ఏండ్లు ఎనలేని సేవలు చేసా
బిఆర్ఎస్ పార్టీకి సురేష్ నాయక్ రాజీనామా
బిఆర్ఎస్ పార్టీకి సురేష్ నాయక్ రాజీనామా
*దయాకర్ రావు వీరభిమానిగా 14 ఏండ్లు ఎనలేని సేవలు చేసా
*బిఆర్ఎస్ లో గుర్తింపు లేదు
*గిరిజనుల ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
*ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్న
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిజనులను అభివృద్ధి చేయలేదని తన దోర పోకడ విధానాలు నచ్చక బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎర్రబెల్లి వీరాభిమాని లాకవత్ సురేష్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు కు 14 ఏండ్లు ఎనలేని సేవలు అందించానని ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో ఎర్రబెల్లి తన కష్టాన్ని సేవలను గుర్తించలేదని ఆరోపించారు.మా గిరిజన జాతి బిడ్డలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గం స్థాయిలో గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం కాంట్రాక్టర్లని, పెట్టుబడి దారులను, పెత్తందారులు మరియు అగ్రకులాలను మాత్రమే డెవలప్మెంట్ చేసిన పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు.ఇటువంటి పరిస్థితులలో ప్రజా సేవకోసం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్న సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అభివృద్ధి పనులను చూసి వారి నాయకత్వంలో పని చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఇన్ని రోజులు తనకు బిఆర్ఎస్ లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Comment List