భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ రోహిత్ రాజు

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ) సెప్టెంబర్ 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  భారీ వర్షాల కారణంగా ప్రజలు  ప్రమాదాల బారిన పడకుండా పలు సూచనలు బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు.సెల్ఫీ  ఫొటోస్ కోసం   వాగులు,వంకలు,నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దు,వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దు.వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారాయి.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది.కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలి.భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతున్నది కావున పరిసర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం  సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని వెల్లడించారు.

Views: 34
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత? పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత?
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో జరిగే నవకళేబర మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకు మారుస్తారని చెప్పే...
ఘర్షణ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ 
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత 
ఏపీలో తప్పక దర్శించాల్సిన టాప్ 10 అద్భుత దేవాలయాలు.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర క్షేత్రాలు!
భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయాలు ఇవే.. తిరుమల, షిర్డీ, వైష్ణోదేవికి ఏటా ఎంత ఆదాయం వస్తుంది?
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్?.. S-500 టెక్నాలజీపై కీలక ప్రతిపాదన.. చైనా, పాకిస్తాన్‌కు టెన్షనా?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఈ 10 ఆహార అలవాట్లే కారణమా? నిపుణులు ఏమంటున్నారు?