విశ్వహిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు

On
విశ్వహిందూ  మహాసంఘ్ ఆధ్వర్యంలో చలో చండ్రుగొండ

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో) నవంబర్ 21:విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించినట్లుగా విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్, జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్,మహావీర్ కొరవి,అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు ఆని,కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యల మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరు కానున్నారని. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పైదా సోము, కుంజా నాగేంద్రబాబు,సిసింద్రీ,వీర్రాజు,వెంకటేష్,పైదా ప్రసాద్,రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్,బొర్రా నాగమణి,కుంజా భవాని,వాసం రాణి, వట్టం వినోద, ఎండీ రంజాన్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు