అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

కొత్తగూడెం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో కూల్చివేత

On
అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఆర్టీసీ 

పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరోనరేష్) డిసెంబర్10:కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ స్థలాన్ని ఇటీవల ఒక కబ్జాదారుడు ఆక్రమించి నిర్మాణం చేసి షెడ్డును ఏర్పాటు చేసుకోగా ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు నిర్మాణం చేయడంపై కొంతమంది ప్రముఖులు అధికారులకు ఫిర్యాదు చేశారు .ఫిర్యాదులపై ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కలిసి పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు.ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు డిపో మేనేజర్ తో పాటు అధికారులు సిబ్బంది తీసుకుంటున్న చర్యల పట్ల పలువురు సమర్థిస్తున్నారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా సహకరించిన వన్ టౌన్ పోలీసులకు ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 225
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News