ప్రభుత్వ భూమి లో ప్రైవేట్ వ్యక్తుల నిర్మాణాలు, పట్టించుకొని ‘రెవెన్యూ, మున్సిపల్ అధికారులు’.

On
ప్రభుత్వ భూమి లో ప్రైవేట్ వ్యక్తుల నిర్మాణాలు, పట్టించుకొని ‘రెవెన్యూ, మున్సిపల్ అధికారులు’.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 19, న్యూస్ ఇండియా : అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు ) బి. చంద్ర శేఖర్ కల్పించుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజావాణి లో సామాజిక కార్యకర్తలు ఎం. శ్రీధర్, కే. శ్రీనివాస్ లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ భూమి లో ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న నిర్మాణాలను అదుపు చెయ్యలేక విఫలమైన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆ కాలనీ వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారని ఫిర్యాదు దారులు తెలిపారు. సంగారెడ్డి పట్టణములోని బై-పాస్ రోడ్డు కు అనుకోని ఉన్న సర్వేనెంబర్ 374’ లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాదాపు తొమ్మిది వందల గజల ప్రభుత్వ భూమి లో ఎలాంటి ఇండ్లు లేకుండా... ఇంటి నెంబర్ లు పొంది, అధికారులను తప్పు దారి పట్టించారని తెలియచేసారు. రాజకీయ పలుకు బడి తో 59 జి. ప్రకారం క్రమబద్దికరణ చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారని, స్థానిక రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ఇంటినెంబర్ లను, నిర్మాణ అనుమతులు రద్దు చేసినప్పటికీ కూడా రాజకీయ నాయకుల అండతో ఇంకా నిర్మాణాలు చేస్తున్నారని..వెంటనే అట్టి ప్రభుత్వ భూమి లో జరుగుతున్న నిర్మాణాలు తొలగించి, విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థ లు) బి. చంద్ర శేఖర్ కి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ సామాజిక కార్యకర్తలు ఎం. శ్రీధర్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-05-19 at 3.46.00 PM
ప్రజావాణి లో 'ఫిర్యాదు' చేస్తున్న సామాజిక కార్యకర్తలు ఎం. శ్రీధర్, కే. శ్రీనివాస్ లు.
Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News