సంగారెడ్డి లో తిరంగా ర్యాలీ.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 19, న్యూస్ ఇండియా : పహాల్గాం లో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా మనదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. మన దేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని భారతదేశ సైనిక శక్తి ఏమిటో ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కే కాదు ప్రపంచానికి చాటిచెప్పాం అని తెలిపారు. సామాన్య జనాలకు ఏమి జరగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ గా దాడులు చేయడం చూసి మిగిలిన దేశాలు ఆశ్చర్యపోయాయని అన్నారు. మనదేశ సైనికులకు ప్రతీ ఒక్కరూ అండగా నిలిచి సంఘీభావంగా ఈ రోజు తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం అని తెలియచేసారు. ముష్కర మూకలు దేశంలోకి అక్రమంగా చొరబడి అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్నారని, ప్రధానమంతి నరేంద్ర మోదీగారు సైనికుల్లో ధైర్యం నింపి ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టారని తెలియచేసారు. సంగారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమై కొత్త బస్టాండ్ ఐబి వరకు పెద్ద ఎత్తున పట్టణ పౌరులు పాల్గొని జాతీయ జెండాలు చేతబట్టుకొని కొనసాగిందని, భారత్ మాతాకీ జై వందేమాతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజి రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ దేశ పౌరులపై దాడి చేసిన ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుట యుద్ధం చేసి ఉగ్రవాద శిబిరాలను కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేయడం జరిగిందని మన దేశ ఆర్మీ విరోచితంగా పోరాడి విజయం సాధించిందని ఇక భవిష్యత్తులో దేశ పౌరులపై దాడి జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు. ఉగ్రవాదం వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారత పౌరులు పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేలి రవీందర్, ఎడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర రావు దేశ్పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, మాణిక్యరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి వెంకట నరసింహారెడ్డి పోచారం రాములు, చంద్రశేఖర్ అసెంబ్లీ కోకన్వీనర్ మల్లేశం, సుభాష్ రెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్, కసినివాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనా గౌడ్ తేజస్విని పట్టణ మాజీ అధ్యక్షులు ద్వారకా రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ద్వారకా శివ, అజయ్ కుమార్ తులసి ప్రకాష్ రెడ్డి, నర్సింగ్ , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్ సాయి రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండల, పట్టణ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List