గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి:ఎస్సై రమణారెడ్డి 

On
గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి:ఎస్సై రమణారెడ్డి 

లక్ష్మీదేవిపల్లి( న్యూస్ ఇండియా నరేష్):గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి సూచించారు. గణేష్ విగ్రహం ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలను నమోదు  చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్‌లను వినియోగించాలన్నారు. గణేష్ దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతిరోజు పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారన్నారు.

Views: 38
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News