ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా.

On
ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని బడుగు బలహీన వర్గాల వారి పక్షాన ఉండి పోరాటం చేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా పేర్కొన్నారు. ఖమ్మం పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ వసీం అక్రమ్ అధ్యక్షుడు జరిగిన ఖమ్మం పట్టణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని, రాష్ట్ర క్యాబినెట్లో ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ముస్లింలకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు, రాష్ట్రంలో ముస్లిం జనాభా 13 శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా తమను ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. మైనార్టీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుకే ఉన్నాయని ఒక్కరికి సాయం చేసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు, ముస్లింలపై బిజెపి విషయాన్ని చిమ్ముతుందని, ముస్లిం రిజర్వేషన్లపై గందరగోళాన్ని సృష్టిస్తుందని ఆయన అన్నారు. ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారని మా చరిత్రను చెరిపి వేయటం ఎవరి వల్ల కాదని, ముస్లింలు అంటే బిజెపికి భయం అని ఆయన అన్నారు. ఖమ్మం పట్టణంలో పేదలను గుర్తించింది ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రహీం, జిల్లా మహిళా నాయకురాలు నజీమా, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ వసీం అక్రమ్, పట్టణ కార్యదర్శి హనీఫ్ పాషా, పట్టణ నాయకులు జక్రియ, షఫీ, కాసాని బ్రహ్మం, రాజు, జరీనా,నసీమా, పీర్ మహమ్మద్, అన్వర్ పాషా అబ్దుల్ రహీం సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News