మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సద్భావన దివాస్

On
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సద్భావన దివాస్

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సద్భావన దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.పద్మ కళాశాల ప్రిన్సిపాల్, యూత్ అసోసియేషన్ – షారుక్ ఇమ్రాన్ వారు ముందుగా  రాజీవ్ గాంధీ  చిత్రపటానికి పూలమాలవేసి రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు – రాజీవ్ గాంధీ జాతీయ మత సామరస్యం అవార్డు అనేది మత సామరస్యం, జాతీయ సమైక్యత మరియు శాంతిని పెంపొందించడంలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఇచ్చే భారతీయ పురస్కారం. ఈ అవార్డును 1992లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఐ ఎన్ సి) యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్థాపించింది , మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన శాశ్వత సహకారాన్ని స్మరించుకునేందుకు , ప్రశంసా పత్రం మరియు రూ. పది లక్షల నగదు పురస్కారాన్ని కలిగి ఉంటుంది. దీనిని రాజీవ్ గాంధీ జన్మదినమైన ఆగస్టు 20న సద్భావన దివస్ (సామరస్యం దినోత్సవం)గా జరుపుకుంటారు అని విద్యార్థులకు వివరించి క్విజ్ పోటీలు నిర్వహించి అందులో మొదటి ద్వితీయ బహుమతులు ఇచ్చి అనంతరం విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News