తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్
ప్రధాన కార్యదర్శిగా పోనక వీరస్వామి
జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో
గూడూరు మండలంలోని తుడుందెబ్బ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్ పోనక వీరస్వామిలనూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బొల్లి సారయ్య పత్రిక ప్రకటనలు తెలిపారు. ఆదివాసి హక్కుల చట్టాల అమలు కోసం ఎల్లవేళలా పనిచేస్తూ గూడూరు మండలంలోని ఆదివాసి ప్రజలను చైతన్యం చేస్తూ ఆదివాసి ప్రజల సమస్యలను పరిష్కారం దిశ వైపు తుడుందెబ్బ సంఘం బలోపేతానికి పాటుపడాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా ఈసం మల్లికార్జున్ కార్యదర్శిగా తురస నరేష్ లను ఎన్నిక నియమించినట్లు జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య ప్రకటించడం జరిగింది.మిగతా కోరమును గూడూరు మండలంలోని ప్రతి గ్రామం తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగ ఉపాధి చట్టాల అమలు గురించి వివరిస్తూ చైతన్యం చేస్తూ తదుపరి మండల కోరమును నియమిస్తామని తెలియపరచడం జరిగింది.
Comment List