కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..

On
కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమం పథకాల, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. శనివారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రామ్ రెడ్డి గార్డెన్ లో డివిజన్ అధ్యక్షులు సత్యం చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి హాజరై  కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నాయకులు బీఆర్ఎస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పార్టీలో చేరుతున్నారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్, ఉదయ రెడ్డి, డేరంగుల కృష్ణ, శివారెడ్డి ,నాగిరెడ్డి, సాయి, విజయ్, మహేష్ పాల్గొన్నారు.IMG-20230923-WA1478

Views: 58
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన.. డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన భాగ్యమ్మ.. డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన.. రంగారెడ్డి, జూలై 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: తన పేరుపై...
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ