జూనియర్ కళాశాలలో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ ను తొలగించిన ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి.

By Thamas
On
జూనియర్ కళాశాలలో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ ను తొలగించిన ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి.

న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 09 :మహాబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కళాశాల క్లాస్ రూంలో ఉన్న ఫ్యాన్ల కలెక్షన్ ను తీపించిన కళాశాల ప్రిన్సిపల్ కోటేష్  పై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.... విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఒకవైపు కొట్లాడుతుంటే  దాన్ని పట్టించుకోకుండా  జూనియర్ కళాశాల క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కలెక్షన్ను  ప్రిన్సిపల్ తీపించడం సరికాదని అన్నారు. విద్యార్థులకు చదువుకోవడానికి కళాశాల రూమ్ కి 6 ఫ్యాన్లు కేటాయిస్తే అందులో కనీసం 3 ఫ్యాన్లు కూడా నడిపించకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోటేష్ పై చర్యలు తీసుకోవాలి. జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు లేక కళాశాలలో ఉన్న నీటి ట్యాంకును శుభ్రం చేకపోవడం, బాత్రూంలో టాప్స్ సరిగా లేకపోవడం, లైబ్రరీ ఓపెన్ చేయకపోవడం, కాలేజీ ఆవరణలో దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు ఇబ్బంది పడడం, ఇన్ని సమస్య ఉన్నా కూడా కాలేజీ ప్రిన్సిపాల్ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరిస్తున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మండిపడ్డారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ కేటాయించాలని, యూనిఫామ్ సకాలంలో అందించాలని అన్నారు. తక్షణమే ఫ్యాన్ కలెక్షన్ను తొలగించిన కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరి చర్యలు తీసుకోని, ఫ్యాన్ కలెక్షన్ ని తక్షణమే వేయించాలని హెచ్చరించారు. లేనియెడల పిడిఎస్యు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, గణేష్, అరుణ్, దిలీప్, అనిల్, ముఖేష్, సాయి, వీరేష్, సంతోష్, సందీప్, జోహార్ లాల్, అరవింద్, దినేష్,  లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 34
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News