ఏజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
వేడుకలకు హాజరైన రేలారే రేలా గంగ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామంలో.ఏజెఆర్. ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి వారి కుమారులు మనీత్ రెడ్డి మనోజ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో బతుకమ్మ సంబరాలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేలారే గంగా హాజరై తమ ఆట పాట. కళాబృందంతో బతుకమ్మ సంబరాలు ఆట పాటలతో అలరించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని మాట్లాడుతూ ఏ జే ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలిమినేటి జంగారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేదవారికి తనకి తోచినంతలో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబం సభ్యులు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని పహిల్వాన్ పూర్ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comment List