
పోలీసుల తనిఖీలో పట్టుబడిన నగదు
On
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వలిగొండ పోలీసులు ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం రోజున వలిగొండ- తొర్రూరు రోడ్డులో ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ వాహన తనిఖీలలో భాగంగా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన పాక కిష్టయ్య వద్దనుండి 2,38,500 రూపాయలను స్వాధీన పరుచుకుని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ డబ్బులకు సంబంధించిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో అట్టి డబ్బులు భువనగిరి డి టి ఓ ఆఫీస్ కు సమర్పించడం జరిగింది. ఎవరైనా 50 వేలకు మించి డబ్బులు తీసుకెళ్లినట్లయితే వాటికి సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లవలసిందిగా ఎస్సై పెండ్యాల ప్రభాకర్ ప్రజలకు సూచనలు ఇచ్చారు.

Views: 496
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

29 Nov 2023 16:29:55
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
Comment List