భవదీయుడు భగత్‌సింగ్

On

PAVAN baghath-singh: ప్రస్తుతం టాలీవుడ్ లో రానున్న మోస్ట్ అవైటేడ్ మూవీస్ లలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ఒకటి. “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ హట్ తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేసాడట హరీష్. అయితే.. ఈ సినిమాని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసి చాలాకాలమే అవుతున్నా… ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం […]

PAVAN baghath-singh: ప్రస్తుతం టాలీవుడ్ లో రానున్న మోస్ట్ అవైటేడ్ మూవీస్ లలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ఒకటి. “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ హట్ తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేసాడట హరీష్. అయితే.. ఈ సినిమాని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసి చాలాకాలమే అవుతున్నా… ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ అవలేదు. ఇప్పటికైతే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ… సెట్స్ మీదకి ఎప్పుడు వెల్లనుందనేడి మాత్రం కన్ఫర్మ్ చేయడంలేదు. ప్రస్తుతం పవన్ వరుస ప్రాజెక్టులు చేస్తుండటం, మరోపక్క రాజకీయ వ్యవహారాలను కూడా చుసుకుంటుండం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందనేది సినీ వర్గాల మాట.

ఇదిలావుండగా.. ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ రూమర్ ఏంటంటే ఈ సినిమాలో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడట. అది నిజమేనని లేటెస్ట్‌గా హరీశ్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారని, ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తెలిపాడు.

అంతేకాదు, ఈ చిత్రంలో ఫ్యాన్స్‌కి కావాల్సిన హై-మూమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయన్నాడు. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు హరీశ్ పేర్కొన్నాడు. దీంతో.. ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు